జ్ఞానరూపంలో వ్యాపించి ఉన్న శక్తే సరస్వతీ
- vinoo Sparkles
- Jan 24
- 1 min read
అమ్మవారి జన్మతిథి సందర్భంగా నిన్న ముల్కనూర్ గ్రంథాలయంలో జరిగిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు చిన్న వీడియో రూపంలో…!
🙏
అమ్మవారు సరస్వతీ దేవి.
సరస్వతీ…!
*ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ…*
అంతటా వ్యాపించి ఉన్నది కనుక ఆమె సరస్వతి!
ఎంత చక్కటి వ్యుత్పత్తి!
అక్షరాలు ప్రకృతిలో ఉన్నాయి కాబట్టి కనిపెట్టి,నేర్చుకున్నాం.
సైన్స్ ప్రకృతిలో ఉంది,
కాబట్టి కనిపెట్టి,నేర్చుకున్నాం.
సమాజ భావనలు ప్రకృతిలో ఉన్నాయి. కాబట్టి కనిపెట్టి,నేర్చుకున్నాం.
అన్నీ ఈ ప్రకృతిలో, విశ్వంలో వ్యాపించి ఉన్నాయి. వాటినే కనిపెట్టి,నేర్చుకున్నాం…నేర్చుకుంటున్నాం.
విశ్వంలో ఆవిధంగా జ్ఞానరూపంలో వ్యాపించి ఉన్న శక్తే సరస్వతీ
!
ఆ శక్తి కామరూపిణీ…
అంటే…ఆ శక్తికి మన కోరికలకు అనుగుణంగా రూపుదిద్దుకునే అద్భుత శక్తి ఉంది.
కవి సాహిత్యం కోసం తపిస్తాడు.
గణిత మేధావి గణితం కోసం తపిస్తాడు.
భౌతిక శాస్త్రవేత్త భౌతికాంశాల గురించి అధ్యయనం చేస్తాడు.
సంగీతజ్ఞుడు సంగీతం గురించి తపిస్తాడు.
కళాకారుడు తనకు మక్కువగల కళ పట్ల మక్కువ చూపుతాడు.
ఇలా ఎవరు ఏ శాస్త్రం మీద ఆసక్తి కలిగి ఉంటే ఆ రూపంలో రూపుదిద్దుకునే అద్భుత శక్తి ఉంది కాబట్టే ఆమె కామరూపిని…
ఆ శక్తే సరస్వతీ స్వరూపిణి!
అందుకే ఆ శక్తి స్వరూపిణికి నమస్తుభ్యం.
🙏🙏🙏
రావుల గిరిధర్,ఐపీఎస్.,

Comments