



.jpg)




Mulkanoor Praja Granthalayam
సమాజంలో అసమానతలు తగ్గాలన్నా.. ప్రతి మనిషీ ఆత్మగౌరవంతో జీవించాలన్నా... విద్యతోనే సాధ్యమని నమ్మి, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం స్థాపించడం జరిగింది. అజ్ఞానపు చీకట్లను పారదోలడమే కాదు, దురలవాట్లకు దూరంగా యువతను నడపాలని, యువతలో నిగూఢంగానున్న అద్భుతమైన శక్తి సామర్థ్యాలను వెలికి తీసి, కుటుంబానికి, సమాజానికి గొప్ప మానవవనరులను అందించాలనే ఈమహా యజ్ఞంలో మాకు లభించిన సప్త నిధులు ఇవి..
ముల్కనూరు
ప్రజా గ్రంథాలయం
జ్ఞానం
జ్ఞాన సముపార్జన కేవలం పాఠశాల గదులకే పరిమితం కాదు. జీవితాంతం సాగే నిరంతర ప్రవాహం. నేటి వేగవంతమైన ప్రపంచంలో, నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవడం తప్పనిసరి. అలాంటి జ్ఞానార్జనకు ఈ గ్రంథాలయం ఒక పవిత్రమైన ఆలయం. ఇది కేవలం పుస్తకాల కొలువు కాదు, ఆలోచనలకు, ఆవిష్కరణలకు నెలవు.
సాధన
ఏ లక్ష్యానికైనా పునాది సాధన. నిరంతర ప్రయత్నం, ఓర్పు, అంకితభావం.. ఇవి మూలధనం. ఈ లక్షణాలు ఉన్నవారికి విజయం తథ్యం. ఆ పట్టుదలతో కూడిన ప్రయాణంలో మా గ్రంథాలయం ఒక తోడుగా నిలుస్తుంది. ఇది కేవలం సమాచార కేంద్రం కాదు, ఉద్యోగార్థుల కలలను సాకారం చేసే శక్తి కేంద్రం.
విజయం
ఈ ఆవరణలో భావి తరాల ఆశల ఆనవాళ్లు నిక్షిప్తమై ఉన్నాయి. కాలంతో సంబంధం లేకుండా.. ఇక్కడి అక్షర జ్యోతుల వెలుగుల్లో రేపటి తరానికి దారి కనిపిస్తోంది. యువత తామెంచుకున్న ప్రయాణంలో విజయానికి తమవంతు తోడైందీ మన ప్రజా గ్రంథాలయం.
.jpg)






.jpg)
జ్ఞానభూమిలో సప్త నిధులు
గ్రంథాలయ జ్ఞాన భూమిలో మహోన్నత కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడు కార్యక్రమాలు సప్త నిధులుగా భవిష్యత్తు తరాలకు తిరుగులేని సంపదగా మారతాయని విశ్వసిస్తున్నాం. సమాజానికి జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సంస్కృతిని అందించేందుకు మేము చేస్తున్న కృషికి నిదర్శనాలుగా భవిష్యత్ తరాల ముందు ఉండనున్నాయి.
Mulkanoor Praja Granthalayam
ములుకనూర్ ప్రజా గ్రంథాలయం హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలంలోని ములుకనూర్ గ్రామంలో ఉంది. ఈ గ్రంథాలయం పేద , దిగువ మధ్య తరగతి విద్యార్థులకు వివిధ ప్రవేశ, ఉద్యోగ, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి సహాయపడేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో యువతను పుస్తకాల వైపు నడిపించి విజ్ఞానం అందించ ే లక్ష్యంతో ఏర్పాటు ఏర్పాటైంది.
ముల్కనూరు
ప్రజా గ్రంథాలయం
జ్ఞానం
జ్ఞాన సముపార్జన కేవలం పాఠశాల గదులకే పరిమితం కాదు. జీవితాంతం సాగే నిరంతర ప్రవాహం. నేటి వేగవంతమైన ప్రపంచంలో, నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవడం తప్పనిసరి. అలాంటి జ్ఞానార్జనకు ఈ గ్రంథాలయం ఒక పవిత్రమైన ఆలయం. ఇది కేవలం పుస్తకాల కొలువు కాదు, ఆలోచనలకు, ఆవిష్కరణలకు నెలవు.
సాధన
ఏ లక్ష్యానికైనా పునాది సాధన. నిరంతర ప్రయత్నం, ఓర్పు, అంకితభావం.. ఇవి మూలధనం. ఈ లక్షణాలు ఉన్నవారికి విజయం తథ్యం. ఆ పట్టుదలతో కూడిన ప్రయాణంలో మా గ్రంథాలయం ఒక తోడుగా నిలుస్తుంది. ఇది కేవలం సమాచార కేంద్రం కాదు, ఉద్యోగార్థుల కలలను సాకారం చేసే శక్తి కేంద్రం.
విజయం
ఈ ఆవరణలో భావి తరాల ఆశల ఆనవాళ్లు నిక్షిప్తమై ఉన్నాయి. కాలంతో సంబంధం లేకుండా.. ఇక్కడి అక్షర జ్యోతుల వెలుగుల్లో రేపటి తరానికి దారి కనిపిస్తోంది. యువత తామెంచుకున్న ప్రయాణంలో విజయానికి తమవంతు తోడైందీ మన ప్రజా గ్రంథాలయం.
గ్రంథాలయం
The only thing that you absolutely have to know,
is the location of the library.
-Albert Einstein
01
Program
01
Program
01
Program
01
Program
01
Program
01
Program
సక్సెస్ స్టోరీ
అజ్ఞానపు చీకట్లను తొలగించడమే కాదు, యువతను దురలవాట్లకు దూరంగా ఉంచి వారిలోని అద్భుతమైన శక్తి సామర్థ్యాలను వెలికి తీయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న ముల్కనూరు లైబ్రరీ ఆ ప్రయత్నంలో నూటికి నూరుపాళ్లు విజయం సాధించింది. దీనికి నిదర్శనం.. లైబ్రరీ వనరులను ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతే. ఉపాధ్యాయులుగా, సబ్ ఇన్ స్పెక్టర్లుగా, పోలీస్ కానిస్టేబుళ్లుగా , మిగతా రాష్ట్ర, కేంద్ర ఉద్యోగ సర్వీసులు సాధించిన వారు 33 మంది యువతీ యువకులు ఎంపికయ్యారు. వీటితో పాటుగా దూడం పవన్ కు బీబీసీలో జర్నలిస్ట్ ఉద్యోగం వచ్చింది.
నమస్తే - ముల్కనూర్.. కథోత్సవం!
కథలకు పట్టం... రచయితలకు ఎనలేని ప్రోత్సాహం

కథ 2025
జాతీయ స్థాయి కథల పోటీ..
ఈ కథల వ్రతంలో.. ఓ రచయితది చెలియలికట్ట దాటని ఆవేశం మరో కథకుడిది కట్టలు తెంచుకున్న ఆవేద న.. ఆలోచనలకు రెక్కలు తొడిగింది ఒకరైతే .. ఆప్యాయతలకు పెద్దపీట వేసింది మరొకరు! ఈ పోటీ క్రతువులో.. అందరూ అందరే.. అక్షరాన్ని ఉపచారంగా ఎంచుకున్నవారే! భాషయాసలను నివేదనగా అర్పించినవారే!! అందుకే కాబోలు.. ఈ దఫా నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీ పీఠం కథల పోటీలో కథలు వరాల జల్లుగా వర్షించాయి. కథల పోటీ 2025 కు వెల్లువలా వచ్చిన వందలాది కథలను విశ్లేషించి.. అనేక దశల్లో వడబోసి.. అత్యుత్తమ కథలను ఎంపిక చేయనైనది.

కథ 2023-24
ఐదు వసంతాల పవిత్ర క్రతువు..
మనం అను కున్న గమ్యానికి ఒక్క సంవత్సరమైనా చేరుతామా? లేదా? అనే మీమాంస నుంచి ఐదు సంవత్సరాలు సాగిన అందమైన కథా ప్రయాణం మాకు గొప్ప సంతృప్తినిస్తుంది. ముల్కనూరు సాహితీ పీఠం నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ క్రతువుకు రచయితలే యాగ్నికులు. పాఠకులే యజమానులు. తెలుగు కథామూర్తికి మకుటాన్ని తొడగడం మాకు దక్కిన అదృష్టం. ఇది మాకెళ్లప్పుడూ చెప్పలేని ఆనందం.

కథ 2022
ప్రతిష్టాత్మక కథోత్సవం
2019 నుంచి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్ తున్న వార్షిక కథల పోటీల్లో నాలుగవది. ఈ పోటీలో 70 కథలు బహుమతులకు ఎంపికైనాయి.

కథ 2021
నమస్తే తెలంగాణ - ముల్కనూరు కథల పోటీ
ఏటా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి కథల పోటీల్లో ఇది మూడవది. 64 కథలు విజేతగా నిలిచాయి. ఈ పోటీకి పెద్దింటి అశోక్ కుమార్, గింజల మధుసూదన్ రెడ్డి, దేవారాజు విష్ణు వర్ధన్ రాజు, కొమఱ్ఱాజు అనంత కుమర్, కోడూరి విజయ కుమార్, గోగు శ్యామల మొదలైనవారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

కథ 2020
జాతీయ స్థాయి కథల పోటీ
2019 నుంచి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక కథల పోటీల్లో రెండవది. ఇందులో 50 కథలు బహుమతులకు ఎంపికైనాయి. ఈ పోటీకి నాళేశ్వరం శంకరం, జూపాక సుభద్ర, ఎగుమామిడి అయోధ్యారెడ్డి, కె. అనంత కుమార్, గింజల మధుసూదన్ రెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

కథ 2019
జాతీయ స్థాయి కథల పోటీ..
ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న కథల పోటీల్లో ఇది మొదటిది. 22 కథలు బహుమతులకు ఎంపికయ్యాయి. మధుసూదన్ రెడ్డి, కోడూరి విజయకుమార్, పెనుగొండ బసవేశ్వర్, నగేష్ బీరెడ్డి , ఇట్టేడు అర్కనందనాదేవి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

ప్రజాగ్రంథాలయ కార్యవర్గం
అధ్యక్షులు: వంగా రవి
జనరల్ సెక్రటరీ : గొల్లపల్లి లక్ష్మయ్య
వైస్ ప్రెసిడెంట్ : పల్లా ప్రమోద్ రెడ్డి
జాయింట్ సెక్రటరీ : ఎదులాపురం తిరుపతి
ట్రెజరర్: తాళ్ల వీరేశం
కార్యనిర్వాహక సభ్యులు:
మాడుగుల కోమురయ్య
గన్ను కృష్ణమూర్తి
బొజ్జపురి మురళి క్రిష్ణ
దుబ్బాక నాగరాజు
దర్న శ్రీనివాస్
ప్రధాన సలహాదారులు:
వేముల శ్రీనివాసులు
సలహాదారులు:
కోడూరి సుగుణాకర్
అయితా కిషన్ ప్రసాద్
మూలా శ్రీనివాస్
సుద్దాల సంపత్
వొరం నటరాజ సుందర్
రావులపల్లి శంకర్ రావు
మూల స్థంభాలు
వేములు శ్రీనివాసులు :స్ఫూర్తి
అయిత కిషన్ ప్రసాద్ : నిత్య చైతన్య గీతి
వంగ రవీందర్ : కార్యసాధకులు
సుగుణాకర్ : పట్టు వదలని విక్రమార్కుడు
మూల శ్రీనివాస్ : అన్నిటికీ మూలం
సీహెచ్ శ్యాం సుందర్ : చేతికి ఎముక లేని దాత
సుద్ధాల సంపత్ : ప్రాక్టికల్ ఎవర్ రెఢీ
శంకర్ రావు : అన్నిటికి సై
డాక్టర్ రాజా : మార్గదర్శి
నటరాజ్ సుందర్ : రాతగాడు
డాక్టర్ అశోక్ : మనసున్న డాక్టర్
పల్లా ప్రమోద్ రెడ్డి : భవన నిర్మాణ మూల స్థంభం
తిరుపతి : నిరంతరం గ్రంథాలయ జపం
లక్ష్మయ్య : సరస్వతీ పుత్రులను తయారు చేసే మంత్రదండం
వీరేశం : వన్ మ్యాన్ ఆర్మీ , స్మైలింగ్ సెయింట్
మాడుగుల కొమురయ్య : నిగర్వి, రాళ్లు మోసిన శ్రామికుడు
గోవర్ధన్ రెడ్డి : జగమెరిగిన యాంకర్
వినోద్ : ఎల్లవేళలా అందుబాటులో
మల్లిభట్ వాసు: అందమైన బొమ్మలు వేసే అందమైన మనసు
హితులు సన్నిహితులు..
సర్వశ్రీ
నీలగిరి దివ్య దర్శన్ రావు, కీర్తి భిక్షపతి, మస్న వెంకట్, సత్యనారాయణ, మినహాజుద్దీన్, చొల్లేటి సంపత్, బొజ్జపురి అశోక్, డాక్టర్ సుధీర్, చిట్టుమల్ల నరేందర్, అప్పన శ్రీనివాస్, పొన్నం శశిధర్, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కరుణ సాగర్, జెట్టి సంపత్ కుమార్, అడ్డాల రవి సుధాకర్, అయిత ప్రవీణ్ కుమార్, ఎర్రం మధుసూదన్ రెడ్డి, డాక్టర్ నాగ సురేష్, కొమర్రాజు అనంతకుమార్, గింజల మధుసూధన్ రెడ్డి, కోడూరి విజయ్, దేవరాజు విష్ణువర్ధన్ రాజు, దాసరి వెంకటరమణ, రావుల శశిధరా చారి,రావుల గిరిధర్, వేముల రామచంద్రం, నల్లవెల్లి శ్రీనివాస్.

Mulkanoor Library
Mandal: Bheemadevarapalli,
District: Hanamkonda,Telangana - 505 471