top of page
j_edited.jpg
j_edited.jpg

హనుమకొండ జిల్లా,
భీమదేవరపల్లి మండలం, తెలంగాణ

ముల్కనూరు ప్రజా గ్రంథాలయం

పేద , దిగువ మధ్య తరగతి విద్యార్థులకు మరియు వివిధ ప్రవేశ, ఉద్యోగ, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు సహాయపడేందుకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో యువతను పుస్తకాల వైపు నడిపించి విజ్ఞానం అందించే లక్ష్యంతో 2014 లో గ్రంథాలయం ఏర్పాటైంది. శ్రీమతి వేముల అనసూయ గారు మొదట రూ. 5 లక్షల విలువైన పుస్తకాలను అందించి ఈ మహత్కార్యానికి  అంకురార్పణ చేశారు. ఆ తొలి విరాళంతోనే గ్రామంలో గ్రంథాలయం ప్రారంభమైంది. గ్రంథాలయ నిర్వహణకు కమిటీ కూడా ఏర్పాటైంది. ఈ కమిటీకి గ్రామ పంచాయతీ అండగా నిలిచి గ్రామంలో ఎనిమిది గుంటల భూమిని గ్రంథాలయ భవనానికి కేటాయించింది. అప్పటి నుంచీ మొదలైన గ్రంథాలయ ప్రస్థానం ప్రజా, ప్రజాప్రతినిధుల సహకారంతో అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. 

కమిటీ 

Elli Chuluo

(Clinical Director)

Gia Raviv

(Lead Therapist)

George Mekler

(Wellness Coordinator)

Talya Sulami

(Psychiatrist)

Abee Chie

(Psychiatrist)

Lily Jonas

(Patient Care Coordinator)

03

మంచి మార్పు కోసం

ముల్కనూరు ప్రజాగ్రంథాలయం గ్రామీణ ప్రాంతంలో వెలసిన విజ్ఞాన భాండాగారం. ఊర్లలో పిల్లలను పుస్తకాల వైపు మళ్లించడమే ప్రథమ లక్ష్యం. అందులో భాగంగానే.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి అండగా ఉండి.. వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఆర్థిక సంపద కన్నా మనిషికి జ్ఞాన సంపద ఎంతో అవసరం. నోటి మాట ద్వారా మనిషిలో కొన్నిసార్లే మార్పు రావొచ్చేమో కానీ, మనిషిలో సంపూర్ణ మార్పు తేవడానికి మంచి పుస్తకానికి మించినది లేదు. అందుకే ప్రజల్లో ముఖ్యంగా యువతలో సంపూర్ణ మార్పు తీసుకురావడమే ఈ సంస్థ అంతిమ లక్ష్యం. 

503604276_10020836111357754_5501066765033846623_n_edited.jpg

01

గ్రంథాలయానికి అండగా.. 

రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు రూ.20 లక్షలు, ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీశ్ కుమార్ గారు రూ.10 లక్షలు, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్‌రావు గారు రూ.5 లక్షలు వారి నిధుల నుంచి కేటాయించారు. స్పందన ఛారిటబుల్ ట్రస్ట్ , ముల్కనూరు గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సభ్యులు మరో రూ.10 లక్షలు అందించారు. 2025 లో గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్​ గారు ఈ గ్రంథాలయానికి ​ రూ. 10 లక్షలు కేటాయించారు. ఎంతో మంది దాతలు ఆర్థిక సాయం చేశారు. 

b90cc77c-e323-4bf5-8708-04e81dc1fc59.jfif

02

గ్రంథాలయంలో సౌకర్యాలు

ప్రజాగ్రంథాలయంగా విలసిల్లుతున్న చదువుల ఒడిలో..  చదువరులకు కావాల్సిన అన్ని సౌకర్యాలున్నాయి. సుమారు 50 మంది కూర్చొని చదువుకునేందుకు ప్రశాంతమైన రీడింగ్​ రూమ్​ ఉంది. 10 కంప్యూటర్లున్న ల్యాబ్​.. గ్రంథాలయానికి వచ్చే అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. వేగవంతమైన ఇంటర్నెట్​ సౌకర్యంతో అభ్యర్థులు తమకు కావాల్సిన ఆన్​లైన్​ సేవలను పొందుతున్నారు. ఆన్​లైన్​ కోచింగ్​, ఆన్​లైన్​ క్లాసెస్​ వినడానికి, డిజిటల్​ బుక్స్​, ఈ పేపర్స్​ చదవడానికి ఈ ల్యాబ్​ ఉపయోగకరంగా ఉంది. అలాగే ఆఫీస్​ గదులు, కార్యవర్గ ఆఫీస్​తో పాటు.. అదనంగా గెస్ట్​ రూమ్​లు ఉన్నాయి. గ్రామానికి ఎవరైన గెస్ట్​ లెక్చరర్లు, విద్యాధికులు, రీసెర్చ్​ ప్రొఫెసర్లు, సైంటిస్టులు వచ్చినప్పుడు వారి బసకు అనుకూలంగా ఈ గెస్ట్​ రూమ్​లు ఉపయోగపడుతున్నాయి. మొదటి అంతస్తులో వంద మంది కూర్చొని సభ జరుపుకునేందుకు వీలుగా సమావేశమందిరం ఉంది. గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులు ఏ పుస్తకం అడిగినా 24 గంటల్లో అందుబాటులోకి తేవడం ఈ గ్రంథాలయ ప్రత్యేకత. 

hall_edited.jpg
Library

ప్రజాగ్రంథాలయ కార్యవర్గం

అధ్యక్షులు: వంగా  రవి
జనరల్ సెక్రటరీ : గొల్లపల్లి లక్ష్మయ్య 

వైస్ ప్రెసిడెంట్ : పల్లా ప్రమోద్ రెడ్డి
జాయింట్ సెక్రటరీ : ఎదులాపురం తిరుపతి 
ట్రెజరర్: తాళ్ల వీరేశం
 

కార్యనిర్వాహక సభ్యులు: 
  మాడుగుల కోమురయ్య  
    గన్ను కృష్ణమూర్తి  
    బొజ్జపురి మురళి క్రిష్ణ
    దుబ్బాక నాగరాజు 
    దర్న శ్రీనివాస్  

ప్రధాన సలహాదారులు:
వేముల శ్రీనివాసులు

  సలహాదారులు: 
    కోడూరి సుగుణాకర్  
    అయితా కిషన్ ప్రసాద్
    మూలా శ్రీనివాస్
    సుద్దాల సంపత్
    వొరం నటరాజ సుందర్ 
    రావులపల్లి శంకర్ రావు

bottom of page