top of page

చేయూత..

చేయి చేయి కలిపి.. భవిష్యత్తు నిర్మించి.. 

503604276_10020836111357754_5501066765033846623_n_edited.jpg

ముల్కనూరు ప్రజాగ్రంథాలయం ప్రజల ఉదారతతో, సామాజిక జిజ్ఞాస కలిగిన నాయకుల, అధికారుల సాయంతో నిర్మితమైంది. దీనికి ప్రజలందరి సహకారం గొప్ప పునాది. ఈ గ్రంథాలయానికి ఎంతో మంది దాతలు, ముఖ్యంగా గ్రామంలో ఉన్నవారు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడినవారు విరాళాలు అందించారు. కొందరు ఆర్థికంగా ఆసరగా అందించగా.. మరికొందరు ఉద్యోగార్థులకు అవసరమయ్యే కాంపిటేటివ్​ బుక్స్​ను అందించారు. మరికొందరు లైబ్రరీకి అవసరమయ్యే వనరులను సమకూర్చారు. ప్రజలు తమ శక్తికి మించి విరాళాలు ఇచ్చి ఈ గ్రంథాలయానికి ప్రాణం పోసి, ప్రజల ప్రేమ, ఉదారత, ఐక్యతకు నిదర్శనంగానూ ఈ ప్రజాగ్రంథాలయాన్ని ఉదాహరణగా నిలిపారు. ఈ గొప్ప సంకల్పంలో మీరూ భాగస్వాములు కావడం మేము అదృష్టంగా భావిస్తాం..

దాతలు..

ముల్కనూరు ప్రజా గ్రంథాలయం స్వచ్ఛంద సేవకు నిలువెత్తు నిదర్శనం.  ఏ  ఎన్జీవో లోనైనా  సంస్థకు వచ్చే నిధుల్లో 35% నుంచి 40% వరకు సిబ్బంది జీతభత్యాలకు కేటాయిస్తారు. కానీ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం ఈ  విధానానికి పూర్తిగా భిన్నం.  గ్రంథాలయానికి విరాళాల రూపంలో వచ్చే  ఒక్క పైసా కూడా సిబ్బంది జీతాల కోసం వినియోగించబడదు. ఈ మొత్తం   ఫండ్  అంతా గ్రంథాలయ అభివృద్ధికి, పుస్తకాల కొనుగోలుకు, పేద విద్యార్థుల భవిష్యత్తుకు సంపూర్ణంగా అంకితమవుతోంది.
ఎందుకంటే, ఇక్కడ పనిచేసే సిబ్బంది జీతాలు తీసుకునే ఉద్యోగులు కాదు. వారంతా తమ కర్తవ్యాన్ని గుర్తెరిగి, తమ సమయాన్ని, శ్రమను స్వచ్ఛందంగా (వలంటీర్లుగా) ఈ మహత్తర కార్యానికి అంకితం చేసిన సేవామూర్తులు. ఇలా నిస్వార్థ సేవకు మారుపేరుగా  మహత్తర సంస్థగా ముల్కనూరు ప్రజా గ్రంథాలయం నడుస్తోంది.

_VIP3482.jpg

దానం పరం భూషణం

Donation

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం దాన గుణం.  చదువుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి విద్యను అందించడం మరింత పవిత్రమైన దాన గుణం. అది సమాజ శ్రేయస్సుకు అవసరం కూడా.  ప్రజా గ్రంథాలయం ద్వారా మేము తలపెట్టిన మహత్తర కార్యానికి మీ చేయూత అవసరం..

Library

ప్రజాగ్రంథాలయ కార్యవర్గం

అధ్యక్షులు: వంగా  రవి
జనరల్ సెక్రటరీ : గొల్లపల్లి లక్ష్మయ్య 

వైస్ ప్రెసిడెంట్ : పల్లా ప్రమోద్ రెడ్డి
జాయింట్ సెక్రటరీ : ఎదులాపురం తిరుపతి 
ట్రెజరర్: తాళ్ల వీరేశం
 

కార్యనిర్వాహక సభ్యులు: 
  మాడుగుల కోమురయ్య  
    గన్ను కృష్ణమూర్తి  
    బొజ్జపురి మురళి క్రిష్ణ
    దుబ్బాక నాగరాజు 
    దర్న శ్రీనివాస్  

ప్రధాన సలహాదారులు:
వేముల శ్రీనివాసులు

  సలహాదారులు: 
    కోడూరి సుగుణాకర్  
    అయితా కిషన్ ప్రసాద్
    మూలా శ్రీనివాస్
    సుద్దాల సంపత్
    వొరం నటరాజ సుందర్ 
    రావులపల్లి శంకర్ రావు

మా చిరునామా..

503604276_10020836111357754_5501066765033846623_n_edited.jpg

Mulkanoor Praja Grandhalayam,
5-93, Mulkanoor (village), Bheemadevarapally Mandal, Hanumakonda District – 505 471, 
Telangana.
Phone Numbers : 

9441313559  Thirupathi  
9908905976  Veeresham 

The branch office of the Trust
Mulkanoor Sahithi Peetham  

at 3-17, DSL Abacus IT Park, Uppal, Hyderabad-500039. 

bottom of page